
పరిపాలన అమరావతికి మారిన వెంటనే లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైంది. నేరుగా తీసుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో దీనికోసం భారీ వ్యూహాన్నే రూపొందించారు. టీడీపీి వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం నేతలు తొలుత ముఖ్య మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తారు. మరోవైపు దేశం శ్రేణులు లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకోవాలంటూ ప్రచారం నిర్వహిస్తాయి. ప్రజాభీష్టం మేరకే లోకేశ్‌కు పదవి వచ్చిందని పించేలా అవసరమైన కసరత్తులనీ చేస్తారని తెలిసింది.