
కాంగ్రెస్, అవినీతి పర్యాయ పదాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ ఎద్దేవా చేశారు. అస్సాంలోని బోర్ఖెత్రే నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందని, రూ.1,80,000 కోట్లకు అవకతవకలు జరిగినట్లు కాగ్ ఎత్తిచూపిందని పేర్కొన్నారు. నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగపత్రాలు ఇవ్వాలని కాగ్ కోరితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఇవ్వడం లేదని విమర్శించారు.