
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద గల అరబిందో ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు సిఐటియు ఆద్వర్యములో చేసిన సాధించింది. నూతన వేతన ఒప్పందం జరిగింది. అరబిందో కార్మికుల విజయోత్సవ సభలో సిఐటియు రాష్ట్ర ఉసాధ్యక్షులు, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సి.హెచ్.నర్సింగరావు మాట్లాడారు.ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఐక్యతతో మందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమవుతాయని అన్నారు .ఐక్యతే ఆయుధం.పోరాటమే మార్గం అని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు.