ఆంధ్రప్రదేశ్లో 20వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వయో పరిమితి సడలింపు అంశాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఈ ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల వయో పరిమితిని 45 ఏళ్ల వరకు సడలించాలని విన్నవించారు.