
నకిలీ మద్యం తయారు చేసినా.. అమ్మినా మరణశిక్షను విధించడానికి ఉద్దేశించిన బిల్లును బిహార్ శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ్యులు మద్యాన్ని సేవించకూడదనే తీర్మానాన్ని కూడా ఉభయ సభల్లోని సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. శాసనాలు చేస్తున్న ప్రజాప్రతినిధులే ముందుగా మద్యానికి దూరంగా ఉండి.. ప్రజలను కూడా ఆ వైపు నడిపించాలని బిహార్ ఎక్సైజ్(సవరణ) బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు.