
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు రోజుల క్రితం తొలిసారిగా బెంగాల్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడి అక్కడి అధికారపక్షాన్ని (తృణమూల్)ను మాటమాత్రం అనకుండా వామపక్ష కూటమిపై దాడి ఎక్కుపెట్టారు.ఈ విషయం బెంగాల్‌లో చర్చనీయాంశంగా మారడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ధైర్యముంటే నారదా స్టింగ్ ఆపరేషన్‌లో లంచాలు తీసుకుంటూ పట్టుబడిన తృణమూల ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని బిజెపి అధ్యక్షులు అమిత్‌షా మంగళవారం సవాల్ విసిరారు. మమత అధికారంలోకి వచ్చిన తరువాత బాంబుల మోత తప్ప సంగీతం వినిపించడం లేదని ఆయన అన్నారు. శారదా కుంభకోణంలో తృణమూల్‌కు, బిజెపికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వచ్చిన ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు.