
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాలు ఆరంభంనుంచి గందరగోళ పరిస్థితుల మధ్యే జరిగాయి. పలుమార్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమావేశాలనుంచి వాకౌట్ చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాజకీయ డ్రామాలే తప్ప ప్రజా సమస్యలు, శాసన సభ నియమ నిబంధనలు అవసరం లేకుండా పోయాయని విమర్శలు వెల్లువెత్తాయి.