
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. హరీష్ రావత్ ప్రభుత్వం మార్చి 18న మెజార్టీని కోల్పోయినప్పటికీ అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం అని, ఆర్టికల్ 356ను అమలు చేయడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏదీ ఉండదని కేంద్రం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ పేర్కొనడంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు.