
వామపక్షాలు, డిఎండికె, విఎస్‌కె, ఎండిఎంకె సంయు క్తంగా ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమి ఈ నెల 31న అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. డిఎండికె 124, వామపక్షాలకు 35, ఎండిఎంకెకు 40, విఎస్‌కెలకు 35 సీట్లను సర్దుబాటు చేసుకున్న విషయం విదితమే. ప్రజా సంక్షేమ కూటమి.. కెప్టెన్ కూటమిగా ప్రచారం కావడంతో వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రజా సంక్షేమ కూటమిగానే ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జి.రామ కృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ పట్టుబట్టారు. ఆదివారం చెన్నరుకి వచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. వ్యక్తులకు ప్రాధాన్యత లేకుండా, ప్రజా సంక్షేమ ఫ్రంట్‌గానే పేరు ఉండాలని సూచించారు.