
వ్యవసాయసంబంధ సమస్యలైన రుణాలు, ఉచిత విద్యుత్ బిల్లులు, స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు గిట్టుబాటు, మద్దతుధర లాంటి అంశాలపై నాసిక్‌లో సోమవారం నిర్వహించనున్న రైతు ర్యాలీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెఎస్) అనుబంధ సంస్థ మహారాష్ట్ర రాజ్య కిసాన్ సభ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎఐకెఎస్ జాతీయ సంయుక్త కార్యదర్శి అశోక్ ధవాలె వెల్లడించారు. సుమారు లక్షమంది కార్యకర్తలు, రైతులు హాజరవ్వబోయే ఈ ర్యాలీలో అటవీ హక్కుల చట్టం పునరుద్ధరణకు డిమాండ్ చేస్తామని ఆయన తెలిపారు. దేశంలో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనీ వీటిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామనీ అన్నారు