
అవినీతిని నిర్మూలించేందుకే తెలంగాణలో శాసనసభ, శాసనమండలి సభ్యుల వేతనాలు పెంచుతున్నట్టు ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి చెప్పారు. పైగా వేతనాలు పెంచాల్సిందిగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని కోరారని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.