
ముంబయి ఉగ్రదాడులకు సంబంధించి పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ ప్రక్రియ నేటి నుంచి జరుగుతుంది. ముందు ఖరారు చేసిన ప్రకారం మంగళవారం నుంచి జరగాల్సి ఉంది. హెడ్లీ న్యాయవాదుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం నుంచీ విచారణ ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు.