రాజద్రోహ చట్టంపై సమగ్ర నివేదిక..

జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన రాజద్రోహ చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని లా కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్‌ బల్బీర్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. అయితే దీనిపై హడావిడిగా నిర్ణయం తీసుకోమని, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. 'రాజద్రోహ చట్టాన్ని పునసమీక్షిం చాలి, ఇందులో ఉన్న లోటుపాట్లు, ఇబ్బందులు ఏంటో తెలుసుకునేందుకు అన్ని వర్గాలతో మాట్లాడతాం, క్రిమినల్‌ లాయర్లనూ దీనిపై సంప్రదిస్తాం' అని చౌహాన్‌ చెప్పారు. రాజద్రోహం చట్టంలో ప్రధానంగా 124ఏ సెక్షన్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే అంశం పరిశీలించకుండా లా కమిషన్‌ హడావిడిగా ఎలాంటి నిర్ణయం తీసుకోదని అన్నారు