
జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలు విద్యార్థి సంఘాలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికాయి. హెచ్ సీయూకు కన్హయ్య వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం వర్సిటీలో జరుగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. కన్హయ్యకుమార్ రాకతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 విద్యార్థి సంఘాలు కన్హయ్య కుమార్ రాకను స్వాగతిస్తున్నాయి. కానీ ఎబివిపి నేతలు మాత్రం కన్హయ్య రాకను వ్యతిరేకిస్తున్నారు. వీసీ అప్పారావుకు బాసటగా నిలుస్తున్నారు.