
''భారత్ మాతా కీ జై'' ప్రాతిపదికన జాతీయవాదాన్ని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ నేత శశి థరూర్ సోమవారం తీవ్రంగా విమర్శించారు.భారత్ మాతా కీ జై అని అనడం నాకు సంతోషమే, అయితే అ ంత మాత్రాన అందరినీ అలా అనాల్సిందేనని నేను ఒత్తిడి తీ సుకురాగలనా? అని ప్రశ్నించారు. జెఎన్‌యులో విద్యార్ధులనుద్దేశించి ఆయన ఆదివారం రాత్రి మాట్లాడారు. కేవలం ''హిందీ, హిందూ, హిందూస్తాన్'' దేశం మనది కాదని, ఇది భారతదేశమని, మరింత వై విధ్యతను ఆమోదించే దేశమని అన్నారు.