
అత్యంత ప్రమాదకరమైన,వినాశకరమైన,ప్రజల ప్రాణాలను హరించే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం రద్దు చేయాలని సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యమ్.కృష్ణమూర్తి డిమాంఢ్ చేసారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు వ్యతిరేకంగా సిపియం ప్రజాసంఘాల ఆద్వర్యములో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రభావిత గ్రామాలలోపర్యటించారు.సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యమ్.కృష్ణమూర్తి మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్రమాదకరమని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓలను రద్దుచేయాలని డిమాండ్ చేసారు. అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత సహజమని అన్నారు.అణువిద్యుత్ యూనిట్ తయారికి 10 రూపాయిలు ఖర్చు అవుతుందని అన్నారు.ప్రజలు యూనిట్‌కు 12 రూపాయలు చెల్లించాలని అన్నారు. ఏవరి ప్రయోజనాల కోసం అణువిద్యుత్ కార్మాగారం ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా అణువిద్యుత్ కార్మాగారంకు భూసేకరణకు సిద్దమవుతుందని దుయ్యబట్టారు.ప్రజల.ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ,బిజెపి పార్టీ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంను వ్యతిరేకించి నేడు అనుకూలంగా జివోలు యిస్తుందని విమర్శించారు. ఈ పర్యటనలో సంజీవని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కూన.రామం,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు,సిఐటియు జిల్లా కార్యదర్శి సి.హెచ్. అమ్మన్నాయుడు,పి.తేజేశ్వరావు,కె.గురునాయుడు,వివిధ సంఘాల నాయుకులు యన్.వి.రమణ,యస్.సీతరామరాజు,బాలి.శ్రీనువాసరావు తదితరులు పాల్గోన్నారు.