
ఉన్నత విద్యా మండలిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలు 52:48 నిష్పత్తిలో జరగాలని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఖాతాల్లో ఇరు రాష్ట్రాలకు వాటా వుంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఉన్నత విద్యామండలి కేసులో శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.