
ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే భేటీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్లు పాల్గొంటున్నారు. నేషనల్ ఎగ్జిక్యూట్‌మెంట్ మీట్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు.