
జెఎన్‌యు విద్యార్థ్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌కు మాజీ సైనికోద్యోగి ఒకరు లీగల్ నోటీసు పంపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భద్రతా బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ కన్నయ్యకు ఈ నోటీసులు వచ్చాయి. మండి జిల్లాలో రిటైర్డ్ సుబేదార్ కెహన్ సింగ్ థాకూర్ ఈ నోటీసులు పంపారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా తమ వాణిని వినిపిస్తామంటూనే సైనికుల పట్ల తమకు గౌరవం వుందని అయితే కాశ్మీర్లో మహిళలపై భద్రతా బలగాలు అత్యాచారాలకు పాల్పడిన వాస్తవంపై తాము మాట్లాడతామని కన్నయ్య వ్యాఖ్యానించారు.