
బెంగాల్లో స్టింగ్ ఆపరేషన్ మమతా సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్లు వెల్లడించే ఓ వీడియో పశ్చిమబెంగాల్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీఎంసీ ఎంపీలు సౌగత్‌రాయ్, అహ్మద్ మిజ్రా, బెంగాల్ మంత్రి సుబ్రతముఖర్జీ , కోల్‌కతా మేయర్ శోవన్ ఛటర్జీ ఓ లాబీకి హామీలిస్తూ లంచాలు తీసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపించారు. నారదన్యూస్.కామ్ అనే వెబ్ ఛానల్ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించింది.