
‘జంగల్ మహల్’ ప్రాంతంలో తిరిగి పట్టు సాధించడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్య ప్రచారం నిర్వహించాలని నిషేధిత సీపీఐ(మావోయిస్టు) భావిస్తోంది. జంగల్ మహల్గా పిలిచే పురులియా, బంకెరా, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో సుమారు 40 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 30 స్థానాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది.