
కొవ్వాడ అణుపార్కు భూసేకరణను ప్రతిఘటిండి
అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్రమాదకరం
---సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్.నర్సింగరావు
కొవ్వాడ అణుపార్కు భూసేకరణను ప్రతిఘటించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. రణస్థలంలో దేవిశ్రీ కళ్యాణ మండపంలో కొవ్వాడ అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆధ్వర్యములో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్రమాదకరమని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓలను రద్దుచేయాలని డిమాండ్ చేసారు.అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత సహజమని అన్నారు.అణువిద్యుత్ యూనిట్ తయారికి 10 రూపాయిలు ఖర్చు అవుతుందని అన్నారు. ఏవరి ప్రయోజనాల కోసం అణువిద్యుత్ కార్మాగారం ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఏటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్నా అణువిద్యుత్ కార్మాగారంకు భూసేకరణకు సిద్దమవుతుందని దుయ్యబట్టారు.ప్రజల ప్రాణాలను పణంగా పెడుతుందని విమర్శించారు.ఈ సమావేశంలో సంజీవని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కూన.రామం,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు,సిఐటియు జిల్లా కార్యదర్శి సి.హెచ్. అమ్మన్నాయుడు,వివిధ సంఘాల నాయుకులు కె.గురునాయుడు,యన్.వి.రమణ తదితరులు పాలో్గన్నారు.