
పశ్చిమ బెంగాల్, కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేసే అవకాశాలు లేవని జేఎన్యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్ సూచన ప్రాయంగా చెప్పారు. 'ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోవడంలేదు. నేను ఒక విద్యార్థిని. నేను నా పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిని కావాలన్నది నా కోరిక. అయితే, అప్పుడు కూడా నా క్రియాశీలత కొనసాగుతుంది' అని కన్నయ్య పేర్కొన్నారు.