
జెఎన్‌యు ఘటనలో ప్రధాన ఆధారంగా ఢిల్లీ పోలీసులు చూపించిన నకిలీ వీడియోలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి డిమాండు చేశారు. సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను జెడియు నాయకులు కె.సి త్యాగితో కలసి సీతారామ్ ఏచూరి ఢిల్లీ సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఏచూరి మాట్లాడుతూ...జెఎన్‌యు ఘటనలపై ఢిల్లీ ప్రభుత్వం తరపున విచారణ జరిపినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపామన్నారు.