
పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సోమవారం సిపిఐ(ఎం) విడుదల చేసింది. మొత్తం 294 స్థానాలకు గాను 116 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు ఇక్కడ మీడియా గోష్టిలో విడుదల చేశారు. వీరిలో 16 మంది మహిళలు, మైనార్టీ కమ్యూనిటికి చెందిన వారు 25 మంది ఉన్నారు. కాంగ్రెస్తో వేదిక పంచుకునే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.