
సమాచార హక్కు చట్టం పరిధి నుండి రాజకీయ పార్టీలను మినహాయించాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుఫ్రీం కోర్టులో అఫిడివిట్ దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం క్రింద పార్టీ కార్యకలాపాలు, ఆర్ధిక అంశాలతో పాటు అంతర్గత వివరాలు తెలపాలంటూ సామాజిక కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ , డెమక్రాటిక్ రైట్స్ అనే ఎన్జీఓ తో కలిసి కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, బిఎస్పి, సిపిఐ, ఎన్సిపి పార్టీలకు దరఖాస్తు చేశారు..