
గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం మహారాష్ట్రతో జరిపిన దౌత్యం మాదిరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌తోనూ ఇదేవిధంగా జల సమస్యలను అధిగమిస్తామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. దేశమంతా నీటి కోసం యుద్ధాలు చేసుకుంటూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నూతన దిశానిర్దేశం చేశారని చెప్పారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై ఈ నెల 8న మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని వెల్లడించారు.