
తనపై ఎన్ని కేసులు పెట్టిన బయపడేది లేదని, జెఎన్‌యు విద్యార్థి ఉద్యమ వారసత్వం తనకు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చిందని తీహార్ జైల్ నుంచి విడుదల అయిన జెఎన్‌యు ఎస్యు అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పేర్కొన్నారు. ఆ రోజు(ఫిబ్రవరి 9)న జెఎన్‌యులో ఎవరూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని, ఎబివిపి సహాయ కార్యదర్శి ముందుస్తు ప్రణాళికతోనే, జి న్యూస్ చానల్‌ను తీసుకొచ్చి తప్పుడు వీడియోలు సృష్టించారని ఆరోపించారు. జెఎన్‌యు డిఎన్ఎలోనే అట్లాంటి ఆలోచన లేదని కానీ బిజెపి ప్రభుత్వం జెఎన్‌యుపై కక్షకట్టి ఈ ఘాతుకానికి వడిగట్టిందన్నారు.