
జేఎన్యూలో 'దేశద్రోహం' అనే భూతాన్ని సృష్టించి, దేశవ్యాప్తంగా ఉన్మాదం రెచ్చ గొట్టడం వెనుక జరిగిన కుట్రలు ఒకటొక్కటిగా బైటి కొస్తున్నాయి. దీని వెనుక సూత్రధారులెవ్వరో ఆలస్యం గానైనా సరే నగంగా ముందు కొస్తున్నారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సంస్థ మొత్తం ఏడు వీడియోల్లో రెండింటిని మార్ఫింగ్ చేసినట్టు ప్రకటిం చిన విషయం తెలిసిందే. వాటిలో ఒక వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసింది శిల్పి తివారీ అని ఇప్పుడు బైటపడింది. ఈమె మరెవ్వరో కాదు స్వయంగా హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీకి సన్నిహితురాలన్న నిజం కూడా వెలుగులోకి వచ్చింది.