
అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని పదే పదే చెబుతున్నా ఆచరణలో అదెక్కడా కనిపించడం లేదు. ఏ పని చేయాలన్నా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అప్పు తీర్చే బాధ్యత పూర్తిగా సిఆర్డిఏ పైనే వేయనుంది. వేలకోట్ల రుణం తీర్చడం అంత తేలికయ్యేపనికాదు. దీనికోసం సిఆర్డిఏ రీజియన్ పరిధిలో పర్మిషన్లు ఇచ్చేందుకు వసూలు చేస్తున్న వివిధ రకాల ఛార్జీలను గణనీయంగా పెంచనున్నారు. బిల్డింగ్ ప్లాను, లేఅవుట్లు, నిర్మాణాల పన్నులు పెరగనున్నాయి. రెవెన్యూ నుండి వసూలు చేస్తున్న స్థల స్వభావ మార్పునూ సిఆర్డిఏకు బదలాయించనున్నారు. అమరావతిలో యూజర్ ఛార్జీల మోత మోగనుంది. అప్పుతో రోడ్లు వేసి వాటి బకాయిలను ప్రజల నుండే కట్టించనున్నారు. దీనికోసం టోల్గేట్లు పెట్టనున్నారు. కిలోమీటరుకు రూపాయి నుండి ఆరు రూపాయల వరకూ టోల్ఛార్జీ వసూలు చేయనున్నారు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్స్ ప్రకారం ఉంటుందని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు. సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా విదేశీ సంస్థలే ఉండనున్న నేపథ్యంలో వాటికి ఇది పెద్ద భారం కాకపోవచ్చని అంటున్నారు.