
నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ మళ్లీ చేతులు కలపనున్నారు. వారి కరచాలనానికి వాషింగ్టన్లో ఒక శిఖరాగ్ర సభ వేదిక కానున్నది. షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మంగళవారం ఈ విషయం చెప్పారు. మార్చి 31, ఏప్రిల్ 1న వాషింగ్టన్లో జరగనున్న అణుభద్రత శిఖరాగ్ర సభ సందర్భంగా మోదీ, నవాజ్‌లు భేటీ అయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.