
బూటకపు ఎన్కౌంటర్లో ఇష్రాత్ జహన్ను హతమార్చిన ఆరోపణలపై గుజరాత్ పోలీసులపై తీసుకున్న చర్యలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల పోలీసుల నిర్బంధంలో ఉన్న లష్కరే తోయిబాకు చెందిన డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 2004 ఇష్రాత్ జహన్ ఎన్కౌంటర్లో క్రిమినల్ ప్రాసిక్యూషన్, సస్పెన్షన్ సహా గుజరాత్ పోలీసులపై చేపట్టిన అన్ని చర్యలను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలైంది.