
వ్యాపం కుంభకోణంతో సంబంధమున్న వారు ఒక్కొరొక్కరూ మరణి స్తుండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ అంశంపై వార్తలు రాస్తు న్న జర్నలిస్టు, జబల్పూర్కు చెందిన వైద్య కళాశాల డీన్ మరణించారు. డీన్ డాక్టర్ అరుణ్ శర్మ మృతదేహాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం కనుగొ న్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాలకు ఆయన డీన్‌గా వ్యవహరి స్తున్నారు. వ్యాపం కుంభకోణాన్ని ఆయన పరిశోధిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇన్చార్జి డీన్ అయిన డాక్టర్ డి.కె. సక్కలే 90శాతం కాలిన గాయాలతో చనిపోయి కనిపించారు. డాక్టర్ శర్మ మృతిపై ప్రస్తుతం ఏమీ వ్యాఖ్యానించలేమని ఢిల్లీ పోలీసు లు చెప్పారు. తన తండ్రి మధుమేహంతో బాధపడుతున్నారని డాక్టర్ శర్మ కుమారు డు చెప్పినట్లు, వాయవ్య ఢిల్లీ డిసిపి ఆర్.ఎ. సంజీవ్ తెలిపారు. శనివారం సాయం త్రం డాక్టర్ శర్మ విమానాశ్రయానికి సమీపంలోని ఉప్పల్ హొటల్ గదికి చేరారనీ, ఆదివారం ఉదయం తనను నిద్ర లేపవలసిందిగా కోరారనీ చెప్పారు. ఎప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారన్నా రు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించగా, డీన్ మంచంపై చనిపోయి ఉన్నా రన్నారు. గదిలో ఎటువంటి అనుమానించదగ్గ వస్తువులూ లేవనీ, ఆయన శరీరంపై గాయాలు కూడా కనిపించలేదనీ వివరించారు. మృతదేహాన్ని పరీక్షకు తరలించారు.
మరో సంఘటనలో ఈ కేసును కవర్ చేస్తున్న ఒక చానెల్ విలేకరి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై, శనివారం నాడు కన్నుమూశారు. వ్యాపం కేసులో బయటకొ చ్చిన ఒక యువతి మృతి నేపథ్యంలో ఈ జర్నలిస్టు ఆమె తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ సంఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఝాబువా పట్టణంలో ఈ సంఘటన చోటుచేసు కుంది. టీవీ టుడే గ్రూపులో అక్షరు సింగ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యాపం కుంభకోణంలో నమ్రత దమోర్ అనే యువతి పేరు బయటికొచ్చింది. ఈ నేపథ్యం లో ఆమె ఉజ్జయినీ జిల్లాలో రైల్వే పట్టాలపై ఆమె శవమై కనిపించింది. ఆమె తల్లిదం డ్రులను అక్షరు ఇంటర్వ్యూ చేశారు. పోస్టుమార్టంలో ఎటువంటి అనుమానాస్పద అంశాలూ వెల్లడికాలేదు. శరీరంపై గాయాలు కూడా కనిపించలేదు. మృతికి కారణాన్ని కనుగొనేందుకు శరీర భాగాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు.
అక్షరు తమను శనివారం ఇంటర్వ్యూ చేశారని నమ్రత తండ్రి మెహ్తాబ్ సింగ్ చెప్పారు. ఆయనతో పాటు ఇద్దరు వచ్చారన్నారు. ఇంటర్వ్యూ ముగిసిన తరవాత కొన్ని ప్రతులను జిరాక్స్ కోసం తన సహాయకుని బయటకు పంపారనీ, మెట్ల మీద నిలబడిన అక్షరు కొద్దిసేపటికి నోటిలోంచి నురగలు కక్కుకుంటూ పడిపోయారనీ తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్నవారిలో 25మంది ఇప్పటి వరకూ కన్నుమూ శారు. ఉద్యోగ నియామకాలలో జరిగిన భారీ కుంభకోణాన్ని వ్యాపంగా వ్యవహరిస్తు న్నారు. ఇందులో అధికారులు, రాజకీయనాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మధ్య ప్రదేశ్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. శవపరీక్ష నివేదిక వస్తే కానీ, ఈ విషయమై నిర్ణయం తీసుకోలేమని మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వారి మరణాల గురించి ప్రస్తావిస్తూ, కేసు కోర్టులో ఉందనీ, విచారణ కూడా కొనసాగుతోందనీ వివరించారు.