
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2016-17 బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు. రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను రాయితీ 2వేల నుండి 5వేలకు పెంచారు.