అసెంబ్లీ సమావేశాలు మార్చి ఐదున ప్రారంభమవుతాయని, 10న బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కలెక్టర్ల సదస్సలో ఆయన మాట్లాడుతూ 15 నెలల్లోనే రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధించామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మండలాల వారీగా జిఎస్‌డిపి నమోదు చేస్తామని వెల్లడించారు.