
సీబీఐ మాజీ డైరెక్టర్ కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారనే ఆరోపణలతో ఇప్పటికే కళ్యాణ్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు.ఇదిలా ఉంటే ఇప్పటికే సుజనా చౌదరిపై గతంలో రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ ను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై ఈ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది. కాగా, మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు.