స్వల్ప మార్పులతో మాస్టర్‌ప్లానును విడుదల చేశారు. ఉత్తర దక్షణ దిశలుగా ఉండే ఐదురోడ్లు, తూర్పు పడమరలుగా ఉండే ఒకరోడ్డును కొద్దిగా అటూ ఇటూ జరిపారు. దీంతోపాటు నీరుకొండ దగ్గర ఏర్పాటు చేయనుకున్న రిజర్వాయర్ స్థలాన్ని, కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలనూ మార్పులు చేర్పులు చేశారు. మంత్రి నారాయణ విడుదల చేసిన ప్లానులో దాదాపు గ్రామాల్లో రోడ్లు వెళ్లడాన్ని నివారించారు. ఒక్క ఐనవోలు గ్రామంలో మాత్రమే నష్టాన్ని కొద్దిగా తగ్గించారు. ఉండవల్లి గ్రామంలో గతంలో నాలుగురోడ్లను ప్రతిపాదించి వాటిని ఎత్తేశారు. అయితే సీడ డెవపల్‌మెంట్ ఏరియా ఉన్న మందడంలో రోడ్లను మార్చలేదు. రాయపూడి, తాళ్లాయపాలెం వద్ద నున్న సీడ్ డెవలప్‌మెంట్ ఏరియా రోడ్లను స్వల్పంగా తూర్పుదిశకు మార్చారు.. తుళ్లూరు తూర్పుభాగంలో ఉత్తర, దక్షిణ దిశలుగా ఉన్న రోడ్డును తూర్పువైపునకు మార్చారు. అయితే తూర్పు, పడమరలుగా ఉన్న రోడ్డును అలాగే ఉంచేశారు. సిఎం నివాసం నుండి పెనుమాక వరకూ వేసిన 150 అడుగుల రోడ్డును పూర్తిగా ఎత్తేశారు. ఉండవల్లిలో కొండవీటివాగు ప్రవాహ ప్రాంతాన్ని గతంలో డ్రాప్ట్‌లో చూపించిన విధంగా కాకుండా స్వల్పమార్పులు చేర్పులు
చేశారు. కృష్ణాయపాలెం వద్ద రోడ్డును ఎత్తేశారు. రిజర్వాయర్ ఎలైన్‌మెంట్‌ను మార్చాలని ఆ గ్రామస్తులు కోరినప్పటికీ మార్పులు చేయలేదు.