
బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్ జన శక్తి (ఎల్జేపీ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని పేర్కొంటూ నితీష్ కుమార్ ప్రభుత్వంపై మండిపడింది. ఇదే విషయమై గవర్నర్ రామ్ నాథ్ కోవింద్‌ను ఎన్డీయే ప్రతినిధి బృందం కలిసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఎల్జేపీ రాష్ట్రపతి పాలనకై డిమాండ్ చేయడం గమనార్హం. బీజేపీ నాయకుడు విశ్వేశ్వర్ ఓఝా హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ డిమాండ్ చేసింది.