
జెఎన్‌యులో నిరసనల హోరెత్తాయి. గత మూడు రోజులుగా నిరసనలతో క్యాంపస్ అట్టుడుకుతోంది. విద్యార్థి నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రభుత్వ నిరంకుశత్వ, రాజ్యాంగేతర చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. వీరికి ప్రొఫెసర్లు సంఘీభావం ప్రకటించారు. జాతీయత గురించి మాట్లాడే వాళ్ళు అందులో భాగమైన రాజ్యాంగం గురించి మరచిపోయారని ద్వజమెత్తారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను భేషరతుగా విడుదల చేయాలని, అలాగే హిందూత్వ శక్తుల నుంచి యూనివర్శిటీని కాపాడాలని కోరుతూ విద్యార్థులు వర్శిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సోమవారం వర్శిటీ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ బంద్‌లో ప్రొఫెసర్లు తమ కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. ప్రొఫెసర్ల పిల్లలు సైతం బంద్‌లో పాల్గొని ప్రభుత్వ చర్యలను ఖండించారు