
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మూడు జ్యూట్ మిల్లులకు సోమవారం ఆయా యాజమాన్యాలు లాకౌట్ ప్రకటిం చాయి. వీటిలో కొత్తవలస మండలం సీతంపేట వద్దగల ఓల్డు ఉమా ట్వైన్, చింతలదిమ్మ సమీపంలోని న్యూ ఉమా జ్యూట్ ప్రొడక్ట్సు, అదే ప్రాంగణంలోని సాయి జ్యూట్ ప్రొడక్ట్సు మిల్లులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ మూడు మిల్లులూ ఒకే కుటుంబానికి చెందిన వారివి.