
గత మూడేండ్లలో బ్యాంకుల వద్ద పేరుకుపోయిన రూ. 1.14 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) లేదా వసూలు కాని అప్పులను మాఫీ చేశామని ప్రభుత్వం వెల్లడిం చింది. ఈ మొత్తాన్ని భారతీయ బ్యాం కులు గత మూడు ఆర్థిక సంవ త్సరాల్లోనే (2013-15 మధ్య) నష్ట పోయాయి. ఇది గత తొమ్మిదేండ్లలో దేశంలోని 29 రాష్ట్రాలు కలిగి వున్న మొత్తం నిరర్థక ఆస్తుల విలువకన్నా ఎక్కువ.