ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ కుంభకోణంను తెర పైకి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆనంది బెన్ పటేల్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ,నిధుల కేటాయింపుల దుర్వినియోగం పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ చే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.' ప్రభుత్వ ,అటవీ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. చాలా తక్కువ మొత్తానికి ఆ భూములను ' కార్పోరేట్ మిత్రులకు' అప్పటి గుజరాత్ ప్రభుత్వం విక్రయించారు' అని ఆయన ఆరోపించారు.