
రాజధానిలో కూడా రాష్ట్రపతి పాలన విధించాలనే కుట్రలో భాగంగానే బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పారిశుధ్య కార్మికుల సమ్మెను ప్రోత్సహిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో న్యాయసమ్మతం కాని పద్ధతిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిందని గుర్తు చేస్తూ ఢిల్లీ పరిధిలో కూడా అదే తరహా కుట్రలు పన్నుతోందని ఆయన అనుమానం వ్యక్తంచేసారు