
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని విలీన మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి పనులపై దృష్టిపెట్టాలని భద్రాచలం ఎంఎల్ఎ సున్నం రాజయ్య కోరారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పంచాయతీరాజ్ ఎస్ఇ వెంకటేశ్వరరావును సోమవారం కలిశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జితో కలిసి సమస్యలను వివ రించారు.