
ఎక్స్‌ప్రెస్ హైవే పేరుతో ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే చావడానికైనా సిద్ధమని తుళ్ళూరు గ్రామస్తులు సిఆర్డిఎ అధికారులను హెచ్చరించారు. మాస్టర్‌ప్లాన్‌పై గురువారం నిర్వహించిన సదస్సులో సిఆర్డిఎ ల్యాండ్స్ డైరెక్టర్ చెన్నకేశవులు, డిజైనింగ్ డైరెక్టర్ రాముడును గ్రామస్తులు నిలదీశారు. గ్రామకంఠా లపై స్పష్టతివ్వాలని, రైతులకు ప్లాట్లు ఎక్కడ కేటాయించేది మాస్టర్‌ప్లాన్‌లో చూపాలని డిమాండ్ చేశారు. ప్లాన్‌ను తెలుగులోకి అనువదించి మంత్రు లు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే సదస్సులు నిర్వహించాలని, లేకుంటే తాము అంగీకరించ బోమని తేల్చిచెప్పారు..