
ఏపీ తాత్కాలిక సచివాలయం ఎక్కడ..? ఈ ప్రశ్నకు రేపటిలోగా స్పష్టత రానుంది. సీడ్ కేపిటల్ మధ్యలోనే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. భవిష్యత్తులో సమస్యలు రాకుండా... వివిధ ప్రాంతాల్లో భూసార పరీక్షలూ చేయించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ చేతికందడంతో.. తాత్కాలిక సచివాలయంపై ఇవాళ తుది ప్రకటన వచ్చే అవకాశముంది..