
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని వాపపక్షకూటమి మంగళవారం పిలుపునిచ్చింది. తద్వారా చిట్ ఫండ్ స్కామ్‌కు పాల్పడిన వారు అక్రమంగా దాచుకున్న ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో వెనక్కు తీసుకురావడం సాధ్యమవుతుందని లెఫ్ట్ నేతలు పేర్కొన్నారు. నగరంలోని ఉప్పునీటి సరస్సుకు సమీపాన ఉన్న సిబిఐ కార్యాలయం వద్ద సిపిఎం ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్న పలువురు మమత ప్రభుత్వ అవినీతిని వారు నిశితంగా విమర్శించారు. టిఎంసి నాయకులు, వారి బినామీలు కలిసి ఏర్పాటు చేసిన చిట్‌ఫండ్ సంస్థలు ఖాతాదారులను నట్టేట ముంచాయన్నారు.