
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా బాక్సైట్ వ్యతిరేక గొంతులను నొక్కేస్తోంది. భవిష్యత్లో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా గిరిజనులను భయభ్రాంతులకు గురిజేస్తోంది. అక్రమ కేసులు బనాయించి నిర్బంధం ప్రయోగిస్తోంది. జర్రెల మాజీ సర్పంచ్ సాగి వెంకట రమణను హత్య చేసిన మావోయిస్టులకు సహకరించారన్న సాకును చూపించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.