
చైనా స్టాక్ మార్కెట్ల పతనం భారత స్టాక్మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 24,851 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7,568 వద్ద ముగిసింది. కాగా, హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,140కి అమ్ముడు పోతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.24,310కి అమ్ముడు పోతోంది. కిలో వెండి ధర రూ.36,112కు అమ్ముడవుతోంది.