
ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) కుంభకోణానికి సంబంధించి జైట్లీపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను శత్రుఘ్నసిన్హా హీరోగా అభివర్ణించారు. 'కీర్తి ఆజాద్ - హీరో ఆఫ్ ద డే' అంటూ పార్టీపై బహిరంగ విమర్శలు చేస్తున్న శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. ఆజాద్‌పై చర్య తీసుకోరాదంటూ ఆయన పార్టీకి విజ్ఞప్తి చేశారు.